నా ప్రాణమా నాలో నీవు - ఎందుకిలా కృంగియున్నావు ?
దేవునివలన ఎన్నోమేళ్ళను అనుభవించితివే
స్వల్పకాల శ్రమలను నీవు అనుభవించలేవా ?
ఎందుకిలా జరిగిందనీ - యేసయ్యను అడిగే అర్హత నీకు లేనే లేదని
సహించి స్తుతించే - కృప నీకుంటే చాలునులే
నా హృదయమా ఇంకెంత కాలము - ఇంతక నీవు కలవరపడుదువు
దేవుని ద్వారా ఎన్నో ఉపకారములు పొందియుంటివే
అల్పకాల శోధనలను నీవు ఎదిరించి జయించలేవా ? || ఎందుకిలా ||
నా అంతరంగమా నీలో నీవు - జరిగినవన్నీ గుర్తు చేసుకొనుమా
దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు మరచిపోకుమా
బ్రదుకు దినములన్నియు నీవు - ఉత్సాహగానము చేయుమా || ఎందుకిలా |