నీ నెందుకని - నీ సొత్తుగా మారితిని ?
యేసయ్యా నీ రక్తముచే - కడగబడినందున
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయ సీమ
నీ పరిచర్యను తుదముట్టించుటే - నా నియమమాయనే
నీ సన్నిధిలో నీ పొందుకోరి - నీ స్నేహితుడనైతిని
అహా! నా ధన్యత ఓహో! నా భాగ్యము - ఏమని వర్ణింతును || నేనె ||
నీ శ్రమలలో పాలొందుటయే - నా దర్శనమాయెనే
నా తనువందున - శ్రమలు సహించి - నీ వారసుడనైతినే
అహా! నా ధన్యత ఓహో! నా భాగ్యము - ఏమని వర్ణింతును || నేనె ||
నీలో నేనుండుటే నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చెందెద
అహా! నా ధన్యత ఓహో! నా భాగ్యము - ఏమని వర్ణింతును || నేనె ||
Like this:
Like Loading...
Related