Aanandame Paramaanandame |ఆనందమే పరమానందమే

ఆనందమే – పరమానందమే ఆశ్రయపురమైన – యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము పచ్చికగల చోట్ల పరుండ జేసితివే జీవజలములు త్రాగనిచ్చితివే నా ప్రాణమునకు సేదదీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే || ఆనందమే || గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను నీ దుడ్డుకర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే || ఆనందమే || నా శత్రువుల యెదుటే నీవు నాకు విందును సిద్ధము చేసావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము || ఆనందమే
Read more