Tag Archives: aelc songs

Edenu Vanambunandu |ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్

The voice that breathed o’er Eden 566:1,2,3,4,5,6 1.ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్ విధించినట్టి వాక్కు వర్థిల్లు నిప్పుడున్. 2.పవిత్ర కల్యాణంబున్ పదిలపర్చుచు దైవ త్రిత్వంబు నేఁడున్ దీవింప వత్తురు. 3.సంతాన వరమును సంతోష ప్రేమయు వింతైన యైక్యత్వంబు నెంతయు నిత్తురు. 4.ఆదామునకుఁ దండ్రీ, హవ్వ నొ సంగితి వాదరముగ నీమె నీ ధన్యున కిమ్ము 5.నీ ఱెక్క క్రింద వీరిఁ బరిగ్రహించుచు వైరి తంత్రంబునుండి దూరంబుఁ జేయుము. 6.ఈ రీతిన్ బ్రత్కి యంత క్రీస్తేసు పెండ్లికి వీరిద్దరును జేరి బరంగఁ జేయుమి.

Read more

Manavula melu Koraku |మానవుల మేలు కొరకు జ్ఞానియైన

వివాహము 563:1,2,3,4,5 1.మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి మహిని నిర్ణయించెగా ||మానవుల|| 2.కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము దాన మొసఁగెఁ బ్రీతిని ||మానవుల|| 3.యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము లెడబాపుమీ ||మానవుల|| 4.కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను నడుపుమీ ||మానవుల|| 5.భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగులఁ జేయుఁమీ ||మానవుల||

Read more

Kana Purambulo Kadu Vintaga |కానాపురంబులోఁ గడు వింతగా

మంగళము 562:1,2,3,4,5,6 1.కానాపురంబులోఁ గడు వింతగా నీరు జానుగా ద్రాక్షరసమును జేసి పానముగఁ బెండ్లిలో బాగుగా నిచ్చిన దీన రక్షక బెండ్లి దీవించుమీ ||కానా|| 2.రావయ్య పెండ్లికి రయముగా నో యేసు ఈవు లియ్యఁగ వచ్చు హితుని బోలి కావు మీద్వంద్వమును ఘనమైన కృపచేత భావమాలిన్యంబుఁ బాపి యిపుడు ||కానా|| 3.దయ నుంచు మయ్య యీ దంపతులమీఁద దయుఁడవై కాపాడు తండ్రి వలెను నియమంబుగా వీరు నీ చిత్తమును జరిపి భయము లేకుండ గ బ్రతుక నిమ్ము ||కానా|| 4.ఒప్పు మీరఁగఁ జేయు నొప్పందము

Read more
« Older Entries Recent Entries »